Monday, April 29, 2024

కాటేసే ప్రాంతానికి వెళ్లారు: డైరెక్టర్ కామెరూన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : సముద్రపు అట్టడుగున అత్యంత క్రూరమైన ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్లిన దశలో ఈ టైటాన్ కుప్పకూలిందని ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెలిపారు. టైటానిక్ సినిమా దర్శకుడు అయిన అత్యంత ప్రముఖ సినీ దిగ్గజం టైటానిక్ శకలాల వద్ద ఈ టైటాన్ పతనం చెందడం పట్ల ఐదుగురు విషాదాంతం చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. టైటానిక్ శకలాల వద్దకు ఆయన ఇప్పటికే 30 సార్లు వెళ్లి వచ్చారు. సముద్ర గర్భంలో పయనించడం ఓ కళ. దీని మెళకువలను బాగా తెలుసుకుంటే తప్ప దీనిలో రాణించడం కష్టం అన్నారు. లోతుపాతుల్లోని అత్యంత తీవ్రస్థాయి ఒత్తిళ్లను పసిగట్టాల్సి ఉంటుందన్నారు. లేకపోతే ఇటువంటి ముప్పు తప్పదన్నారు.

అయితే టైటానిక్ నౌక ప్రమాదం జరిగి పతనం చెందిన స్థలానికి దగ్గరలోనే ఈ టైటాన్ దుర్ఘటన జరగడం తనకు ఆశ్చర్యం కల్గించిందని తెలిపారు. టైటాన్‌లోని వారికి ఏమి జరుగుతున్నదో తెలియని స్థితిలో ఇది పేలిపోయి ఉంటుంది. లేదా కూలి ఉంటుందన్నారు. అయితే సముద్రంలో వెళ్లుతున్నప్పుడు టైటాన్ ప్రధాన కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన తరువాత గంటకు ఏదో భారీ పేలుడు విన్పించిందని తనకు తెలిసిందని, ఇప్పటి ప్రయాణికులను తీసుకువెళ్లిన ఓసియన్ గేట్‌కు అత్యంత భారీ సెన్సార్లు ఉన్నాయని, ప్రమాదాలను ముందే పసిగట్టవచ్చునని, అయితే సముద్ర అంతర్భాగంలోని తీవ్ర ఒత్తిడి లేదా తీవ్ర ఒత్తిడికి ముందే ఈ సబ్‌మెరైన్‌లో చిన్నలోపం ఏదైనా తలెత్తడం వల్లనే ఇది మునకకు దారితీసి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News