Wednesday, November 6, 2024

మాతృకలోని బేసిక్ ఐడియాను తీసుకొని ఫ్రెష్‌గా…

- Advertisement -
- Advertisement -

రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెడ్’. రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమలతో ఇంటర్వూ విశేషాలు …

Director Kishore Tirumala Interview for RED Movie

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో…
నా మొదటి చిత్రం ‘నేను శైలజ’ ప్యూర్ లవ్ స్టోరీ. ఆతర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ’ పూర్తిగా ఫ్రెండ్‌షిప్ మీద ఉంటుంది. అనంతరం ఒక లూజర్ ఎలా సక్సెస్ అయ్యాడు? అనే పాయింట్ మీద ‘చిత్రలహరి’ తీశాను. అయితే ‘రెడ్’లో వాటన్నింటితో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. నాకు కూడా కొత్తగా ఉంటుందని విభిన్నమైన కథతో ఈ సినిమా చేయడం జరిగింది.
తొలిసారి డ్యూయల్ రోల్…
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ నటిస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రామ్ కెరీర్‌లోనే తొలిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాలోని ఒక పాత్రని కొంచెం ‘ఇస్మార్ట్ శంకర్’ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండేలా డిజైన్ చేశాం. అభిమానుల అంచనాలకు అనుగుణంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.
బేసిక్ ఐడియాను తీసుకొని…
ఈ సినిమా మాతృకలోని బేసిక్ ఐడియాను మాత్రమే తీసుకొని ఫ్రెష్‌గా ఈ సినిమా కథను రూపొందించాను. కథ కోసం ఐదు నెలల పనిచేశాను. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది.
వారి పాత్రలకు మంచి ప్రాధాన్యత…
ఈ సినిమాలోని హీరోయిన్లు నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనదే. ప్రతి క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఉంటుంది.
అద్భుతమైన సంగీతం…
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మణిశర్మ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్రవంతి రవికిషోర్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు.
నెక్ట్స్ మూవీ…
ఈ సినిమా తర్వాత శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేస్తున్నాను. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

Director Kishore Tirumala Interview for RED Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News