Monday, April 29, 2024

డిసెంబర్ నుంచి పాత పద్దతిలోనే రేషన్ బియ్యం పంపిణీ

- Advertisement -
- Advertisement -

Distribution of Ration Rice in old fashioned manner from December

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్-19 ప్యాకేజీ నవంబర్‌తో సరిపెట్టి డిసెంబర్ నుంచి పాత పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ప్రజలకు 8 నెలలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం ప్యాకేజీ ఈ నెలతో ముగియనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో వినియోగదారుడికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయగా.. జులై నుంచి నవంబర్ వరకు 10 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. కాగా, డిసెంబర్ నుంచి నిత్యావసర సరుకులు, స్కేల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుడు చెల్లించాల్సిన ధరల పట్టికను విడుదల చేశారు. ఆహార భద్రత కార్డులున్న లబ్దిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు.

కిలోకు ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. అంత్యోదయ కార్డులున్న వారికి ఒక్కో కార్డుపై 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. ఈ బియ్యానికి కిలోకు ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. ఇక అన్నపూర్ణ కార్డులున్న వారికి ఒక్కో కార్డుపై 10 కిలలో బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు. రాష్ట్రంలో 87.55 లక్షల ఆహార భద్రత కార్డులుండగా.. 2.97 కోట్ల మంది లబ్దిదారులున్నారు. ఇందులో 53.30 లక్షల మందికి జాతీయ ఆహార భద్రతా కార్డులున్నాయి. వీరికి 5 కిలోలు చొప్పున కేంద్రం నుంచి బియ్యం వస్తాయి. ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం కలిపి నెలకు 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది. మిగిలిన 34.25 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రతా కార్డులున్నాయి. కోవిడ్19 ప్రభావంతో గత మార్చి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. గతంలో మధ్యాహ్న పథకం కోసం సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు కేటాయించిన సన్నబియ్యం 80వేల మెట్రిక్ టన్నులు తొమ్మిది నెలలుగా వృథాగా పడి ఉన్నాయి. వాటిని ఆహార భద్రతా కార్డులున్న వారికి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం గైకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News