Monday, April 29, 2024

వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దు: ఆర్బీఐ

- Advertisement -
- Advertisement -

Do not give personal details or documents to anyone: RBI

న్యూఢిల్లీ: రుణ యాపులపై నమోదైన కేసుల అంశంలో ఆర్బీఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) బుధవారం స్పందించింది. ఆర్బీఐ, ఎన్ బిఎఫ్ సికి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని సూచించింది. కొన్ని యాపులు, అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్టు తెలిసిందని వివరించింది. సులభంగా రుణాలు ఇస్తున్న యాపుల మాయలో పడవద్దని ఆర్బీఐ సిజిఎం యోగేష్ దయాల్ హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ఆర్బీఐ పేర్కొంది. యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఆన్ లైన్ యాప్స్ లో లోన్ తీసుకుని చెల్లించలేక కొందరు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News