Monday, April 29, 2024

ఆది ‘శశి’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ హీరో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శశి’. బుధవారం ఆది పుట్టినరోజు పురస్కరించుకొని ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపిన చిరు.. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని పేర్కొన్నారు. ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఆది సరసన సురభి, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కిస్తున్నాడు. ఇక, ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Aadi’s Sasi Movie Teaser launch by Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News