Monday, April 29, 2024

తెలంగాణలో మరో 635 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

635 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 635 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 115 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో11, భద్రాద్రి 25, జగిత్యాల 19, జనగాం 11, భూపాలపల్లి 6, గద్వాల 3, కామారెడ్డి 6, కరీంనగర్ 30,ఖమ్మం 35, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 8, మంచిర్యాల 18, మెదక్ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 49, ములుగు 12, నాగర్‌కర్నూల్ 8, నల్గొండ 25, నారాయణపేట్ 0, నిర్మల్ 4, నిజామాబాద్ 11, పెద్దపల్లి 15, సిరిసిల్లా 7, రంగారెడ్డి 57, సంగారెడ్డి 17, సిద్ధిపేట్ 17, సూర్యాపేట్ 19, వికారాబాద్ 12, వనపర్తి 7, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ లో 39, యాదాద్రిలో మరో 12 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,82,982 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,74,833కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

11 జిల్లాల్లో పది లోపే తేలిన కేసులు….

రాష్ట్రంలో 11 జిల్లాల్లో పది లోపు కేసులు తేలాయి. వైరస్ వ్యాప్తి తగ్గడంతో కేసుల సంఖ్య కూడా తగ్గింది. గతంతో పోల్చితే ఈ వారంలో సుమారు 50 శాతం కేసులు తగ్గాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే వైరస్ తగ్గుముఖం పట్టిందని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో 1,98,087 మందికి ఎలాంటి సింప్టమ్స్ లేకుండా వైరస్ సోకగా, మరో 84,894 మందికి లక్షణాలతో వైరస్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా వీరిలో ఏకంగా 2,74,833 ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతోనే రికవరీ రేట్ 97.12కి పెరిగింది. ఇది దేశ సగటు 95.7 కంటే అదనంగా తేలడం గమనార్హం.

ఎంఎల్‌ఏ ప్రకాశ్‌గౌడ్‌కు కరోనా…

రాష్ట్రంలో మరో ఎంఎల్‌ఏకు వైరస్ నిర్ధారణ అయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్‌కు కరోనా తేలినట్లు అధికారులు ప్రకటించారు.గత రెండు రోజుల క్రితం స్పల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు టెస్టు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. దీంతో గత వారం రోజులుగా తనను కలసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News