Monday, April 29, 2024

ఫీ’జులుం’ వద్దు

- Advertisement -
- Advertisement -

Do not trade corona tests

 

కరోనా టెస్టులను వ్యాపారమయం చేయొద్దు
ప్రభుత్వం నిర్ణయించిన ధరలే తీసుకోండి
లక్షణాలు లేకపోయినా విమాన ప్రయాణికులకు
పరీక్షలు చేయండి, పాజిటివ్‌ల సమాచారాన్ని వెంటనే
ప్రభుత్వానికి చేరవేయండి తు.చ తప్పకుండా
ఐసిఎంఆర్ నిబంధనలుపాటించాలి డయాగ్నస్టిక్స్
ప్రతినిధులకు మంత్రి ఈటల సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత గంభీరమైన పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణం లో చూడవద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా టె స్టులు చేస్తున్న ప్రైవేట్ ల్యాబ్‌లకు పలు సూచనలు చేసేందుకు మంత్రి మంగళవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో డయగ్నోస్టిక్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాధారణ టెస్టులకు, కోవిడ్ టెస్టులకు చాలా తేడా ఉందని, ఈక్రమంలో ప్రజలను భయబ్రాంతులకు చేసే విధంగా ఫీజులు తీసుకోవద్దని ఆయన డయాగ్నోస్టిక్ ప్రతినిధులకు సూచించారు. ప్రభు త్వం నిర్ణయించిన ధరలను మాత్రమే తీసుకోవాలన్నారు. కోవిడ్ టె స్టులకు సర్వేలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ అనే మూడు విధానాలు ఇమిడి ఉన్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలు వెంటనే పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు.

దీంతో పాటు వైద్యారోగ్యశాఖ అధికారులకు సైతం సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పరీక్షలకు వచ్చిన ప్రతి వ్యక్తిని రిజల్ట్ వచ్చేవరకు ఐసొలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటికి వచ్చి టెస్టులు చేస్తామని, ఏ ఇతర పద్ధతుల్లో కూడా కరోనా టెస్టులపై మార్కెటింగ్ చేయవద్దని మంత్రి హెచ్చరించారు. శాంపిల్ సేకరించి క్రమంలో, టెస్టులు చేసే ప్రక్రియలో పనిచేసే సిబ్బందికి పిపిఇ కిట్స్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సరైన రక్షణ కిట్లు లేకుంటే వైరస్ సోకి, వారి ద్వార ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.

ఐసిఎంఆర్(ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అండ్ రీసెర్చ్) నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. కరోనా టెస్టులకు, ఇతర టెస్టులు చేపించుకోవడానికి వచ్చే వారికి వేర్వేరు కౌంటర్లు ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే పలు ల్యాబ్‌లలో అధిక ధరలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని మానుకోవాలని మంత్రి మండిపడ్డారు. వైద్యశాఖ నిర్ణయించిన ధరలు కంటే ఒక్క రూపాయి అదనంగా తీసుకున్నా, సదరు ల్యాబ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అన్నారు.

పిపిఇ కిట్లు, మందులకు అదనపు చార్జీలు ఉంటాయి

ప్రభుత్వం కేవలం టెస్టులకు మాత్రమే ధరలు నిర్ణయించిందని, పిపిఇ కిట్లు, మందులకు అదనపు చార్జీలు ఉంటాయని తెలంగాణ సూపర్ స్పెషలిటి ఆసుపత్రుల అధ్యక్షులు డా భాస్కర్‌రావు అన్నారు. ప్రజలకు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన తెలిపారు. మంగళవారం మంత్రితో భేటీ అనంతరం ప్రైవేట్ ల్యాబ్స్ అసోసియేషన్ ప్రతినిధులు కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా డా బాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రతి ఒక్కరికి టెస్టు అవసరం లేదని, కేవలం సింప్టమ్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత మాత్రమే టెస్టులకు రావాలని ఆయన అన్నారు. కానీ అందరూ మాస్కులు, భౌతికదూరం పాటించడం వలన కొంత వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని ఆయన అన్నారు. టెస్టుల్లో కూడా కేవలం 85 నుంచి 90 మాత్రమే ఖచ్చితత్వం లభిస్తుందని, అదే విధంగా ప్రస్తుతం వచ్చిన మందుల్లో కూడా వందశాతం పనిచేస్తుందనడానికి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. దీంతో మరిన్ని రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కోమార్పిడ్ కండిషన్ వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News