Monday, April 29, 2024

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: శ్రీనివాస రావు

- Advertisement -
- Advertisement -

 Do not want myths over vaccine

హైదరాబాద్: తెలంగాణలో 1200 కేంద్రాల్లో డ్రై రన్ ఏర్పాటు చేశామని, ప్రతీ సెంటర్‌లో 25 మంది వాలంటీర్లు ఉంటారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం, శుక్రవారం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోగ నిరోధక శక్తిని వృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని, కోఠిలో వ్యాక్సినేషన్ కేంద్రం ఉందని, మూడు కోట్ల వ్యాక్సిన్లను నిల్వ చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉందని శ్రీనివాస రావు తెలియజేశారు. మరో వారంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, వ్యాక్సిన్‌పై ఎవరికీ అపోహలు వద్దని తెలియజేశారు. మొదటి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్, పోలీసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News