Monday, April 29, 2024

దేశీయ విమాన ప్రయాణాల్లో రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణ ప్రయాణాలు చేసే వారి సంఖ్య సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా గత గురువా రం నాడు దేవీయంగా 4,63,417 మంది విమానాల్లో ప్రయాణించారు. ఈ విషయాన్ని కేంద్ర వి మానయాన శాఖ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకుంది.ఈ ఏడాది నవంబర్‌లో వీరి సంఖ్య నాలు గు రెట్లు పెరిగిందని తెలిపింది.‘ కొవిడ్ తర్వాత దేశీయ విమానయాన రంగం తిరిగి పుంజుకోవ డం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

సానుకూల వై ఖరి, ప్రగతిశీల విధానాలు, ప్రయాణికుల్లో పెరిగి న విశ్వాసం వంటివి దేశీయంగా విమానసర్వీసు లు ఇలా రికార్డు స్థాయికి చేరుకోవడానికి దోహ దం చేశాయి’ అని విమానయాన శాఖ ట్వీట్ చే సింది. ఈ విషయంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ వేదికగా హ ర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది న వంబర్‌లో ఇప్పటివరకు 5,998 విమాన సర్వీసు ల ద్వారా 4,63, 417 మంది ప్రయాణించారు. ముఖ్యంగా నవంబర్ 18, 19, 20 తేదీల్లో ఎక్కు వ సంఖ్యలో ప్రయాణించారని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News