Saturday, April 27, 2024

సిఎం సహాయనిధికి పెళ్లి ఖర్చులు విరాళం

- Advertisement -
- Advertisement -

aeo santhosh

 

వివాహానికి స్వయంగా హాజరై జంటను ఆశీర్వదించిన మంత్రి సింగిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: వివాహ ఖర్చులు రూ.2 లక్షలు కరోనా చికిత్సకు ఉపయోగించాలని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ క్లస్టర్ ఎఇఒ సంతోష్ సిఎం సహాయనిధికి అందజేశారు. కంగ్టిలో జరిగిన ఎఇఒ సంతోష్ పెళ్లికి నారాయణఖేడ్ ఎంఎల్‌ఎ భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధువరూరులను ఆశీర్వదించారు. సంతోష్ నిర్ణయం యువతకు స్ఫూర్థిదాయకమన్నారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు శ్రమిస్తున్న అందరు ఉద్యోగులలో అతని చర్య ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. కరోనా విపత్తులో కూడా రైతాంగం నష్టపోకుండా గ్రామగ్రామాన పంటలు కొనుగోలు చేస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉద్యోగిగా సంతోష్ అందరికీ ఆదర్శమయ్యాడన్నారు.

తెలంగాణకు టిఆర్‌ఎస్సే శ్రీరామరక్ష
సిఎం కెసిఆర్ నాయకత్వంలో అద్భుతంగా తెలంగాణ పునర్నిర్మాణమవుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ 20వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులకు శుభాకాంక్షలు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. -తెలంగాణ జలవిజయాలు కెసిఆర్ నాయకత్వానికి, చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. ఉద్యమంలో ఏం చెప్పామో అది ఇప్పుడు నిజం చేసి చూయిస్తున్నామన్నారు.

ఆరేళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతి, అమరులు కలగన్న రాష్ట్ర నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. పల్లెలన్నీ ధాన్యం కళ్లాలుగా మారాయని, చరిత్రలో లేని విధంగా ప్రభుత్వమే మద్దతుధరకు వందశాతం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అన్న సిఎం కల సాకారం అయ్యే రోజులు ఎంతో దూరం లేవన్నారు.

 

Donated of wedding expenses to CM Relief fund
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News