Saturday, May 11, 2024

హర్యానాలో గాడిద పాల డెయిరీ..!

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(ఎన్‌ఆర్‌సీఈ) త్వరలో కొత్తగా ఓ పాల కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఆ డెయిరీ ఆవు, గెదెలతో కూడినది కాదు. గాడిద పాలను సేకరణకు. ఈ పరిశోధనా కేంద్రం 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ కూడా ఇచ్చినట్లు రిసెర్చ్ సెంటర్ వారు తెలిపారు. అయితే ఈ జాతికి చెందిన గాడిదలు ఎక్కువగా గుజరాత్‌లోనే కనిపిస్తాయి. వీటి పాలల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. పిల్లలు పుట్టాక రెండు చుక్కలు గాడిద పాలు వారి ముక్కులో వేస్తే ఉబ్బసం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వారి దరి చేరవని మన పెద్దలు చెబుతూ ఉండటం చాలా సార్లు వినే ఉంటారు. వీటి పాల ధర లీటర్‌కు 7వేల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. అలర్జీ, క్యాన్సర్, ఆస్తమా, వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తని పెంచేందుకు హలారి గాడిదల పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ వారు హలారి గాడిదల పాల డెయిరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు.

Donkey Milk Dairy in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News