Monday, April 29, 2024

డ్రగ్స్ విక్రేత, కస్టమర్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Drug racket busted in Hyderabad

తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులు
120 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన హెచ్ న్యూ డిసిపి చక్రవర్తి గుమ్మి

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు, తొమ్మిది మంది డ్రగ్స్ బానిసలను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 గ్రాముల హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ వింగ్ డిసిపి చక్రవర్తి గుమ్మి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, నాచారానికి చెందిన మధన్ లైటింగ్ బోర్డు వర్కర్‌గా పనిచేస్తున్నాడు. చెర్లపల్లికి చెందిన రాజు పరారీలో ఉన్నాడు. నగరంలోని కెపిహెచ్‌బికి చెందిన త్రివిక్రం రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు, అకౌంట్స్ మేనేజర్‌పవన్ చందు, సాప్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్, డిగ్రీ విద్యార్థి భానుప్రకాష్, రాజశేఖర్, శడ్‌రాచ్, రవీంద్రనాథ్, రాజ్‌కుమార్, సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మధన్, రాజు ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఇద్దరు కలిసి విశాఖపట్టణానికి చెందిన బుజ్జీబాబుతో పరిచయం పెంచుకున్నారు.

ఇద్దరు అతడి వద్ద హాష్ ఆయిల్‌ను రూ.60,000లకు కొనగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నారు. ఐదు గ్రాముల బాటిళ్లలో నింపి అవసరం ఉన్న వారికి రూ.3,000లకు విక్రయిస్తున్నారు. నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దీంతో వారివద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి వివరాలు తెలిశాయి. విక్రేతలను, డ్రగ్స్ తీసుకుంటున్న వారిని ఎర్రకుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తన వద్ద 18మంది హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తారని తెలిపారు. ఇందులో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ రెడ్డి, ఎస్సై వెంకట్ రాములు, ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News