Sunday, April 28, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ఇడి దర్యాప్తు వేగవంతం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దూకుడు పెంచింది. దర్యాప్తు వేగవంతం చేసింది. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లు ఇడి ఎదుట సోమవారం హాజరయ్యారు. వారి ఇద్దరి స్టేట్‌మెంట్‌ను ఇడి అధికారులు నమోదు చేశారు. ఇదే కేసులో రెండు వారాల కిందట టిఎస్‌పిఎస్‌సి కీలక ఉద్యోగులు శంకరలక్ష్మి, సత్య నారాయణలను ఇడి ప్రశ్నించింది. ఇద్దరి వాంగ్మూలా లు నమోదు చేశారు. శంకరలక్ష్మీ కాన్ఫిడెన్షియ ల్ సెక్షన్ ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్‌లకు పేపర్లు ఎలా చేరాయనే వివరాలను ఆరా తీసింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌కు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో శంకరలక్ష్మిని పేర్కొంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఇడి అధికారులు సూచించారు. తెలంగాణ పోలీసులు నమోదు చే సిన కేసులో మనీలాండరింగ్ జరిగినట్లుగా ఆధారాలు లభించడంతో ఇడి కూడా విచారణ ప్రారంభించింది.

గతంలో పేపర్ లీక్ కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్ల ఇవ్వాలని కో రింది. అయితే ఇడి లేఖకు సిట్ అధికారులు స్పం దించకపోవడంతో నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదంటూ ఇడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలని భావించిన ఇడి కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. అటు ఈ డి పిటిషన్ పై సిట్ కూడా కౌంటర్ దాఖలు చేసిం ది. కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వ డం కుదరదని వివరిచింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. టిఎస్‌పిఎస్‌సి కేసులో ఆర్థిక లావాదేవీలపై ఇడి దృష్టి పెట్టింది. పబ్లిక్ డొమైన్ ద్వా రా ఇప్పటికే వివరాలు సేకరించిన ఇడి ఇసిఐఆర్ నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతు లు మారాయని గుర్తించింది.ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా అతనికి నోటీసులు జారీ చేసింది. టిఎస్‌పిఎస్‌సి నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది.

40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది. సిట్ అరెస్ట్ చేసిన నిందితుల్ని జైలుకు వెళ్లి ఇడి అధికారులు ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మొత్తం రూ.38 లక్షల మేర నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సిట్ అధికారుల దర్యాప్తు ఆధారంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి విచారణ చేస్తోంది. ఖమ్మా నికి చెందిన ఒక జంటను కూడా ఇడి అధికారులు విచారించి నగదు లావాదేవీలు నిజమే అని ఒక స్పష్టతకు వచ్చారు. అందుకు సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించారు. న్యూ జీలాండ్‌లో ఉంటున్న వ్యక్తి నగదు ఏ రూపంలో పంపారనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ విషయాలపై చైర్మన్, కార్యదర్శికి అవగాహన ఉన్నదా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. లీక్ చేసిన వ్యక్తుల వ్యవహారశైలిపై అనుమానాలు రాలేదా అని కూడా ప్రశ్నించారని తెలుస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News