Monday, April 29, 2024

పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

జన్నారం: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు రేండ్లగూడ, కొత్తూరుపల్లిలో పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య, మహిళా కార్యక్రమాన్ని పరిశీ లించారు.

ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల వివరాలను వైద్యాధికారిని ఉమశ్రీని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రేండ్లగూడ రహదారి పక్కన ఉన్న పల్లె ప్రకృతి వనంతో పాటు స్మశానవాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ గౌతమి, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌లు మొక్కలు నాటారు. అనంతరం దేవునిగూడ పంచాయతీ పరిధిలో గల కొత్తూరుపల్లి పాఠశాలలో బయో గ్యాస్ ప్లాంటును పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ అధికారులు ఈ వర్షాకాలంలో గ్రామాలను పర్యటించి పచ్చదనం, పరిశుభ్రత పట్ల దృష్టి సారించి ఎప్పటికప్పుడు పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల అధికారుపైనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్, శిక్షణ కలెక్టర్లను సర్పంచులు ఆశారాజ్, గుర్రం శిరీష గోపాల్‌రెడ్డిలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి వెంట డీఆర్‌డీఏ అధికారి శేషాద్రి, మంచిర్యాల డీఈవో యాదయ్య, ఎంపీడీవో అరుణరాణి, ఎంపీపీ మాదాడి సరోజన రవిందర్‌రావు, ఎంఈవో విజయ్‌కుమార్, ఎంపీవో రమేష్, , ఈజీఎస్ ఏపీవో రవిందర్, పలువురు అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News