Monday, April 29, 2024

ఉద్యోగ నామ సంవత్సరం

- Advertisement -
- Advertisement -
కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు జరుగనున్నాయి. గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలతో పాటు పలు కొత్త నోటికేషన్లతో పాటు పరీక్షలు ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కొత్త చైర్మన్ ఎప్పుడొస్తారు.. ఎవరొస్తారనేది ఉద్యోగార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా కొనసాగిన చైర్మన్ జనార్థన్‌రెడ్డి, సభ్యులు కా రం రవీందర్‌రెడ్డి, ఆర్.సత్యనారాయణ, లింగారెడ్డిలు తమ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు పంపించా రు. అయితే గవర్నర్ ఇప్పటివరకు ఆ రాజీనామాలకు ఆమోదం తెలుపలేదు.

టిఎస్‌పిఎస్‌సికి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిం దే. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ 9వ తేదీలోపు ఏడాదిలో గా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సిఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో జనవరి 6,7 తేదీలలో జ రగాల్సిన గ్రూప్2 పరీక్షలను కమిషన్ వా యిదా వేసింది. ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడొస్తారు..? పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లను ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగు లు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా గవర్నర్ కోరినట్లు సమాచారం. రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలపై ఇంకా గవర్నర్ ఏ విషయం తేల్చకపోవడంతో కొత్త చైర్మన్,సభ్యుల నియామకం వీలు కాదు కాబట్టి గవర్నర్ రాజీనామాలను ఆమోదించిన తర్వాతనే కొత్త చైర్మన్, సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న ఇద్దరు సభ్యులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులు ఉండగా, అందులో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు తనోబ సుమిత్రా ఆనంద్, కోట్ల అరుణ కుమారిలు కమిషన్‌లోనే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చైర్మన్, ముగ్గరు సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలిన ఇద్దరు సభ్యులు కమిషన్‌లోనే కొనసాగుతారా..? లేక మరికొద్ది రోజులు వేచిచూసి వీరు కూడా రాజీనామా చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు?
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు జనవరి మొదటి వారంలో టిఎస్‌పిఎస్‌సికి కొత్త చైర్మన్, సభ్యులను నియమించి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఒకటో తేదీన నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఫిబ్రవరి ఒకటి నాటికి నోటిఫికేషన్లు వెలువడాలంటే కనీసం రెండు నెలల ముందు నుంచి కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టిఎస్‌పిఎస్‌సి పాత చైర్మన్, సభ్యుల రాజీమానాలు ఆమోదం పొందిన వెంటనే పూర్తి స్థాయి కమిషన్ చేయాలని ఏర్పాటు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటనలు చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరించారు.

ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తొలి ఏడాది కాలంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉండే గ్రూప్ -1 ఉద్యోగ నియామకాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన, గ్రూప్ -2 నియామకాలు మొదటి విడత ఏప్రిల్ 1 నాటికి, రెండో దశ డిసెంబర్ 15 నాటికి భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే గ్రూప్- 3 నియామకాలు తొలి దశ జూన్ 1 నాటికి, రెండో దశ డిసెంబర్ 1 నాటికి, గ్రూప్ -4 ఉద్యోగాలు తొలి విడత జూన్ 1, రెండో దశ డిసెంబర్ 1 నాటికి భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ ఉద్యోగాలన్నింటినీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్టుమెంట్ నియామకాల మిషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది. ఇంకా పోలీసు, మెడికల్, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపింది. దరఖాస్తుదారులు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మెగా డిఎస్‌సికి ఏర్పాట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భారీ స్థాయిలో భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫిషన్ జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఖాళీల రోస్టర్ విధానాన్ని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడిన డిఎస్‌సిని నిర్వహిస్తారా..? లేక కొత్త షెడ్యూల్ ఇస్తారా..? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విద్యాశాఖలో 20 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్‌సి నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశంపై ప్రభుత్వం సమాచారం సేకరించినట్లు సమాచారం. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్‌జిటిలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విద్యాశాఖ సూచించినట్లు తెలిసింది. ఖాళీగా ఉన్న ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News