Saturday, April 27, 2024

మహిళా శక్తి అమూల్యమైనది: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

minister-errabelli-dayakar-

జనగామ: జిల్లాలోని పెద్దపహాడ్ లో మామిడికాయల మార్కెట్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ప్రారంభించారు. ధాన్యం, మామిడి కొనుగోళ్లలో మహిళలదే కీలకపాత్ర అన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఐకెపి మామిడి కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. 3 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలనేది సెర్ప్ లక్ష్యమన్నారు. మామిడి కొనుగోలు కోసం 13 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే ఖమ్మం, నాగర్ కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, జిగిత్యాలలో  ఈ కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు.

రాష్ట్రంలోని మిగితా చోట్ల త్వరలోనే మామిడి కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 300 మెట్రిల్ టన్నుల మామిడి కొనుగోలు పూర్తి చేశామన్న మంత్రి… తెలంగాణలో పుచ్చ, అరటి, బొప్పాయి, పండ్లను కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రసాయనాలు వాడకుండా పండ్లను సహజంగా మాగబెడుతున్నామని సూచించారు. ప్రజలు ఐకెపి పండ్లను వినియోగించండని ఎర్రబెల్లి కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News