Monday, April 29, 2024

మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: ఈటల

- Advertisement -
- Advertisement -

Corona death rate 1.1 percent only in Telangana: Etela

జిల్లా కేంద్రాల్లోనూ ఐసొలేషన్ సెంటర్స్ పెంచాలి
అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోండి
డైట్ కాంట్రాక్టర్స్‌కు అన్నీ బకాయిలు చెల్లిస్తాం
జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల రాజేందర్ 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా పనిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. వైరస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, దాని నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లోనూ మరిన్ని ఐసొలేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. వాటికి అవసరమైన శానిటేషన్, పేషెంట్ కేర్ ప్రోవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌ను నియమించుకోవాలని ఆయన జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాల జాబితానూ తయారు చేసి తనకు పంపాలని, వెంటనే అవి సమకూర్చుతామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పాటు అన్ని ఆసుపత్రులకు హైదరాబాద్ నుంచే ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తామని మంత్రి అన్నారు. అంతేగాక ప్రస్తుతం వర్షకాల పరిస్థితుల్లో అన్ని కోవిడ్ ఆసుపత్రులు, ఐసొలేషన్ సెంటర్లలో జనరేటర్లు, అవి నడిచేందుకు కావాల్సిన డీజిల్‌ను అధిక మొత్తంలో అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

కరోనా కట్టడిపై మంత్రి ఈటల రాజేందర్ అన్ని జిల్లాల వైద్యాధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందుతుందని, ఈక్రమంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన కేసులు క్రమక్రమంగా జిల్లాలకూ వెళ్తున్నాయని ఆయన తెలిపారు. అన్‌లాక్ వలన ప్రజలు రాకపోకలు పెరిగాయని, ఈక్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోని వారు మాత్రమే వైరస్ బారిన పడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ సోకుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం వలన వైరస్ వ్యాప్తిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందని మంత్రి చెప్పారు. దీంతో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల, డయాబెటిస్ రోగులను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మంత్రి అధికారులతో అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం మరింత వేగంగా నిరంతరం శ్రమించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఐసోలేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మెరుగైన ఆహారం అందివ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఫెండిగ్‌లో ఉన్న బకాయిలను అతి త్వరలోనే డైట్ కాంట్రాక్టర్స్‌కు చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఇ డా రమేష్‌రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్‌రెడ్డి, డా గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. అన్‌లాక్ వలన ప్రజలు రాకపోకలు పెరిగాయని, ఈక్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోని వారు మాత్రమే వైరస్ బారిన పడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ సోకుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం వలన వైరస్ వ్యాప్తిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందని మంత్రి చెప్పారు. దీంతో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు.ముఖ్యంగా దీర్ఘకాలిక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల, డయాబెటిస్ రోగులను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మంత్రి అధికారులతో అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం మరింత వేగంగా నిరంతరం శ్రమించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. అదే విధంగా ఐసోలేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మెరుగైన ఆహారం అందివ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఫెండిగ్‌లో ఉన్న బకాయిలను అతి త్వరలోనే డైట్ కాంట్రాక్టర్స్‌కు చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఇ డా రమేష్‌రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్‌రెడ్డి, డా గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Etela Rajender Video Conference with Health Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News