- Advertisement -
అరెస్టయినవారిని విడుదల చేయాలని వామపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: బీమా కొరగావ్ కేసులో అరెస్టయిన వారిపై బూటకపు సాక్షాలు తయారు చేశారని అందువల్ల నిందితులను వెంటనే విడిచిపెట్టాలని గురువారం వామపక్షాలు డిమాండ్ చేశాయి. అమెరికా లోని రోనా విల్సన్ తాలూకు కంప్యూటర్ హాక్ అయిందని, దానిలో నేరపూరిత మెయిల్స్ చొప్పించారని వామపక్షాలు పేర్కొన్నాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ చే దర్యాప్తు చేయించాలని సిపిఎం కోరింది. ఇదంతా ఎన్‌ఐఎ కుట్రలో భాగంగా ఆరోపించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని సిపిఐ కోరింది.
- Advertisement -