- Advertisement -
పాలకవీడు: పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమలో అగ్రి ప్రమాదం చోటు చేసుకున్నట్టు సిమెంట్స్ పరిశ్రమ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్మాగారంలోని కోల్డ్ మిల్లులో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందని వెల్డిండ్ చేస్తుండగా దాని కింద సిమెంట్ తయారీకి ఉపయోగించే సోడియంను తీసుకెళ్ళే బెల్టుపై రవ్వలు పడడంతో కొద్దికొద్దిగా మంటలు చెలరేగాయన్నారు. గమనించిన సిబ్బంది అప్రమత్తమై నీటి ట్యాంకర్లతో మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. ఈ ప్రమాదంలో లైనర్లు, బెల్టు కాలిపోవడంతో సుమారు రూ.1.10వేల ఆస్తినష్టం కలిగినట్లు తెలిపారు.
- Advertisement -