Monday, April 29, 2024

ఆర్నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

సనంద్ : వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటు లోకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌సనంద్ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం లోని సనంద్‌లో సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఆ స్టేషన్‌లో వందేభారత్ రైళ్లు కూడా ఆగుతాయని చెప్పారు. ‘అహ్మదాబాద్ సనంద్ మధ్య ప్రపంచ స్థాయి రైలు ప్రారంభం కానుంది. వచ్చే ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్ రానుంది’ అని రైల్వే మంత్రి తెలిపారు. అలాగే రానున్న సంవత్సరాల్లో సెమీ కండక్టర్ల డిమాండ్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్నారు.

ఈ రంగంలో గుజరాత్ ముందు వరుసలో నిలిచిందన్నారు. సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేస్తామని మైక్రాన్ సంస్థ ఈ జూన్‌లో ప్రకటించింది. ఇందుకోసం ఈ అమెరికన్ కంపెనీ రూ. 22,140 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతున్న బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం పొడవు 508.17 కిమీ. ఈ ప్రాజెక్టు పూర్తయితే అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. జపాన్ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. అయితే మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్ట్ పనులు నెమ్మదించాయి. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్ సనంద్ మధ్య దీన్ని నడపనున్నారు. 2026 లో ముంబైఅహ్మదాబాద్ మధ్య పూర్తి స్థాయిలో అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 న ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ గా వీటిని ప్రారంభించనున్నారు. దీంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య 34 కు చేరనుంది.

Also Read: మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ…. ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదు…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News