Saturday, April 27, 2024

జవవరిలో మొదటి జెఇఇ మెయిన్ నోటిఫికేషన్..?

- Advertisement -
- Advertisement -
First JEE Main Notification in January
ఫిబ్రవరిలో మొదటి సెషన్‌కు పరీక్షలు
ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా సెషన్లు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2022 పరీక్షలకు జనవరి మొదటి వారం లేదా రెండవ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదటి సెషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం తరహాలోనే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు కూడా నాలుగు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో మొదటి సెషన్,ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా రెండు, మూడు, నాలుగు సెషన్లు నిర్వహించే అవకాశాలున్నాయి. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సహా ఇతర రాష్ట్రాల 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి జెఇఇ మెయిన్ తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఈ పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2021 జెఇఇ మెయిన్‌లో అనుసరించిన విధానాలనే 2022 జెఇఇ మెయిన్‌లో కూడా అనుసరించనున్నారు. విద్యార్థులు ఏ సెషన్ పరీక్షకు హాజరు కావాలనుకుంటే ఆ సెషన్‌కు పరీక్ష ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ మొదటి సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా తర్వాతి పరీక్షలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. అలాగే నాలుగు సెషన్లకు హాజరు కావాలనుకుంటే ఒకేసారి అన్ని సెషన్ల ఫీజు చెల్లించడం, లేదంటే తర్వాతైనా దరఖాస్తు చేసుకునేలా విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నారు.

జూన్‌లో నీట్ పరీక్ష

దేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది జూన్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెఇఇ మెయిన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నీట్ పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.నీట్ పరీక్షలో ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉండగా, 180 ప్రశ్నలకే సమాధానం ఇచ్చేలా ఛాయిస్ ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కుల విధానం అమలు చేశారు. అయితే వచ్చే విద్యాసంవత్సరం కూడా ఈ ఏడాది తరహాలోనే ప్రశ్నాపత్రంలో ఛాయిస్ ఉంటుందా..? లేదా..? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కూడా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రత్యక్ష బోధన కొనసాగలేదు. కాబట్టి వచ్చే విద్యాసంవత్సరానికి కూడా ఈ ఏడాది తరహాలోనే 200 ప్రశ్నలకు 180కి సమాధానాలు రాసేలా ఛాయిస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై జనవరిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News