Wednesday, May 8, 2024

 నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ ఆదేశాలతో పంపిణీ, ఒకరికి 10 కేజీల బియ్యం అందజేత, మే, జూన్ నెలలో లబ్ధిదారులకు సరఫరా, ఓటిపి విధానం రద్దు చేయాలంటున్న డీలర్లు, థర్డ్‌పార్టీ బయోమెట్రిక్ ఉత్తమమని సూచనలు

Free ration for people in Telangana

మన తెలంగాణ, సిటీబ్యూరో : నగర ప్రజలకు ప్రభు త్వం గత ఏడాది కరోనా కాలంలో పేదల అకలి తీర్చేందుకు ఆరు నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసి నగర ప్రజలు పస్తులు లేకుండా చూసింది. ప్రస్తుతం సెక ండ్ వేవ్ వైరస్ విజృంభణ చేస్తుండటంతో మే, జూన్ రెండు నెలలపాటు ఇస్తామని కేంద్రం ప్రకటన చేసి తాము 5 కేజీలు, రాష్ట్రాలు 5 కేజీలు ఉచితంగా ఇస్తామని పేర్కొనడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల ఉపాధి కరువై, ఇంటి వద్ద కాలం వెల్లదీస్తూ ఒక పూట భోజనం చేస్తూ ఆర్దాకలితో జీవనం గడుపుతున్నారు.

రెండు రోజుల కితం సిఎం కెసిఆర్ తెల్లరేషన్ కార్డుదారులకు రెండు నెలల పాటు ప్రతి వినియోగదారునికి 10కేజీల చొప్పన అందజేస్తామని ప్రకటన చేసి రెండు రోజుల్లో పౌరసరపరాల అధికారులు పంపిణీ చేయాలని సూచించడంతో అధికారులు ఆదిశగా ఏర్పా ట్లు వేగం చేసి నేటి నుంచి బియ్యం ఇస్తున్నట్లు డీలర్లు పేర్కొంటున్నారు. సరుకులు ఈనెల 3వ తేదీన ప్రారంబించి పాత పద్దతిలోనే ఇచ్చామని నేటి నుంచి ఉచితంగా ఇస్తామని వెల్లడిస్తున్నారు. జిల్లాలో 5,80,590 కార్డులుండగా 21,73,954 యూనిట్లు ద్వారా 1,11,63, 534 కిలోల బియ్యం కేటాయిస్తున్నట్లు, ఉచితంగా పథ కం తీసుకరావడంతో 1,36,21,768 కిలోల బియ్యం సరిపోతాయని జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రతి ఒకరికి తప్పకుండా రేషన్ సరుకులు అందజేస్తామని ప్రజలు ఆందోళన చెందకుండా నెలంతా రేషన్ దుకాణా లు తెరిచి ఉంటాయని వీలైనప్పడు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా డీలర్లు గత ఆరు నెల కితం నూతనంగా తీసుకొచ్చిన ఓటిపి విధానం కరోనా తగ్గుముఖం పట్టేవరకు రద్దు చేయాలని, ఫోన్ నెంబర్‌కు ఓటిపి రావడంతో లబ్దిదారుల నుంచి సెల్‌ఫోన్ తీసుకోవడంతో వైర స్ వ్యాప్తి చెందుతుందని పేర్కొంటున్నారు.

గత నెల రోజు ల్లో వందలాది మంది డీలర్లు కరోనా గురై ఇబ్బందులు పడుతున్నారని లాక్‌డౌన్ సమయంలో థర్డ్‌పార్టీ బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారని అదే తరహాలో మూడు నెలల పాటు కొనసాగించాలని కోరుతున్నారు. సరూర్‌నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, బండ్లగూడ, బాలానగర్, కుత్బుల్లాపూర్, మియాపూర్ ఏరియాల్లో డీలర్లు దుకాణాలు తెరవడంలేదు. మహమ్మారి సోకుతుందని ఇప్పటికే తమ కుటుంబ సభ్యులకు రావడంతో రేషన్ ప్రారంభిస్తే మళ్లీ కరోనా సోకుతుందని భయపడుతూ థర్డ్‌పార్టీ బయోమెట్రిక్ త్వరగా అమలులోకి తీసుకరావాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News