Monday, April 29, 2024

పేదల ఆకలి తీర్చని ఇదివరకటి రేషన్ పంపిణీ : మోడీ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

Free ration helping lakhs of poor amid Covid

అహ్మదాబాద్ : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అమలైన రేషన్ పంపిణీ విధానం సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రభావం పేదలపై పడిందని, ఒకవైపు గొడౌన్లలో ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతున్నా, మరోవైపు ఆకలి, పోషకాహార లోపం ఆ స్థాయిలో తగ్గడం లేదని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) లబ్ధిదారులతో ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ పిఎంజికెఎవై పథకం పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వం కాంక్షిస్తోందని చెప్పారు. ఈ ఏడాది దీపావళి వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని, దీని ద్వారా గుజరాత్‌లో 3.5 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రూ. 2 లక్షల కోట్లతో 80 కోట్ల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కల్పించామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News