Saturday, April 27, 2024

హుజురాబాద్ బరిలో ఓయూ విద్యార్థినేత…

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీ
పార్టీ హైకమాండ్ దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్లు విద్యార్ది నేతలు వెల్లడి
యువ నాయకులకు చాన్స్ ఇస్తే ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయం
ఎన్నికల ప్రచారంలో యువశక్తి చాటుతామంటున్న ఓయూ విద్యార్ది నాయకులు


మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీ నుంచి మరో విద్యార్ది నేత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నట్లు విద్యార్ది నేతలు పేర్కొంటున్నారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి తరువాత నలుగురు విద్యార్ది నాయకులు ఎమ్మెల్యేల పదవులతో పాటు, నామినేటేడ్ పదవులు చేపట్టారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌పార్టీ విద్యార్ది విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నట్లు విద్యార్ది సంఘం నాయకులు వెల్లడిస్తున్నారు. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గం పర్యటించి సిఎం కెసిఆర్ చేపట్టిన అభివృద్ది సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరించి టిఆర్‌ఎస్ గెలిపించాలని 150మంది ఓయూ విద్యార్దులు ప్రచారం చేపట్టారు.

ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాషాయం నుంచి బరిలో నిలుస్తుండటంతో ఆయనను ఢీకొనేందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలను పోటీలో ఉంచాలని టిఆర్‌ఎస్ భావించడంతో అక్కడ బిసి సామాజికవర్గం, టిఆర్‌ఎస్‌పార్టీకి సిఎం కెసిఆర్, యువనేత మంత్రి కెటిఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న గెల్లు శ్రీనివాస్ పోటీలో నిలబడుతున్నట్లు విద్యార్దులు చెబుతున్నారు. ఇప్పటికే సిఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన నాయకులతో ఓయూ విద్యార్దులకు చాన్స్ ఇస్తామని పేర్కొనట్లు బయటకు ప్రచారం రావడంతో ఉస్మానియాలో విద్యార్దులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని, మరోసారి అధికారి పార్టీకే ప్రజలు పట్టం కట్టాలని కోరుతున్నారు.

ప్రత్యేక ఉద్యమ పోరాటంలో ఓయూలో విద్యనభ్యసిస్తూ పార్టీ పిలుపు మేరకు విద్యార్దులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఉస్మానియాలో విద్యార్ది నేతగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి మల్లయ్య యాదవ్ కూడా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ వీణవంక మండలో పార్టీ బలోపేతం చేశారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన బడుగు, బలహీనవర్గాల నాయకుడికి రాజకీయాల్లో అందనంత అవకాశం కల్పించడం సిఎం కెసిఆర్‌కే సాధ్యమన్నారు. దళిత బంధువు పథకం దేశంలో ఏరాష్ట్రంలో ప్రవేశపెట్టలేదని, ఒక తెలంగాణలో ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన తీరుపై పక్క రాష్ట్రాల సిఎంలు ప్రశంసలు కురిపిస్తున్నట్లు ఓయూ విద్యార్ది సంఘం జేఎసీ చైర్మన్ తొట్ల స్వామి, బొల్లు నాగరాజు పేర్కొంటున్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఈటెల రాజేందర్ ఎదుర్కొనే సమర్దుడని, ఆయనకు ఈనెల 16న హుజురాబాద్ సభలో కెసిఆర్ ఎమ్మెల్యే అభ్యర్దిగా ప్రకటిస్తే విద్యార్దులమంతా పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News