Monday, May 6, 2024

బ్యాంకుల్లో సరిపడా నగదు ఉంది: శక్తికాంతదాస్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కరోనా ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిడిపిలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో సరిపడా నగదు ఉందన్నారు. లాక్‌డౌన్ తరువాత 1.20 లక్షల కోట్లు విడుదల చేశామని, మార్చిలో ఆటోమొబైల్ ఉత్పత్తి, అమ్మకాలు తగ్గిపోయాయని, నాబార్డుకు రూ.25 వేల కోట్లు ఇచ్చామని, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సహం కోసం రూ.50 వేల కోట్లు ఇస్తున్నామని, జాతీయ హౌజింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు ఇస్తామని శక్తికాంతదాస్ వెల్లడించారు. ఎఫ్ఐడిబిఐకి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. రివర్స్ రేపో రేటు నాలుగు శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని, రివర్స్ రేపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యుఎంఎ పెంచామని, సెప్టెంబర్ 30 వరకు డబ్ల్యుఎంఎ పెంపునకు అమలు చేశామని శక్తికాంతదాస్ వెల్లడించారు. భారత దేశంలో కరోనా వైరస్ 13,625 మందికి సోకగా 450 మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1778 మంది కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News