Monday, April 29, 2024

రాజస్థాన్ పాఠశాలలో బాలికలపై గ్యాంగ్‌రేప్

- Advertisement -
- Advertisement -

Gangrape on girls in Rajasthan school

రాజస్థాన్ పాఠశాలలో బాలికలపై
గ్యాంగ్‌రేప్, 15మంది టీచర్లపై పోక్సో కేసు

జైపూర్: రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. అల్వార్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అత్యాచారానికి సహకరించిన ఐదుగురు మహిళా ఉపాధ్యాయులుసహా మొత్తం 15మందిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుల్లో పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసినట్టు భివాడీ ఎస్‌పి రామ్‌మూర్తిజోషి తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తుమేరకు ఈ కేసు విషయంలో సస్పెండైన ఉపాధ్యాయుడి పాత్రపై ఆరోపణలొస్తున్నాయి. ముగ్గురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో గతేడాది డిసెంబర్‌లో ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. దాంతో, ఆయణ్ని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతడు బెయిల్‌పై విడుదలయ్యారు. ఐదుగురు బాలికలతో 15మందిపై కేసు పెట్టించడంలో సస్పెండైన ఉపాధ్యాయుడి ప్రోత్సాహమున్నట్టు జోషి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News