Sunday, April 28, 2024

కరోనాను జయించిన అక్కకు డ్యాన్స్‌తో చెల్లెలి స్వాగతం.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

Girl happy dance for sister returns home after beating corona

పుణెః కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన అక్కకు చెల్లెలు తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పుణెకు చెందిన సలోని సత్పుట్ అనే 23 ఏళ్ల యువతికి తప్ప ఆమె కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో చికిత్స కోసం వారు ఆస్పత్రిలో చేరారు. ఈ సమయంలో సలోనికి కరోనా లేకున్నా ఆమెను ఇరుగుపొరుగు వారు దూరం పెట్టడంతో తనకు తాను జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఒంటరిగా గడిపింది. అయితే, కొద్దిరోజుల్లోనే ఆమె తల్లితండ్రులు కరోనాను జయించి తిరిగి వచ్చారు. ఇక, చివరగా కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తన సోదరిని చూసి సంతోషంతో సలోని తనదైన శైలిలో ‘చిల్లర్ పార్టీ’ చిత్రంలోని ‘తాయ్ తాయ్ ఫిష్..’ అనే పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్ చేస్తూ స్వాగతం పలికింది. ఇంటి గేట్ ముందు ఇద్దరు కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Girl happy dance for sister returns home after beating corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News