Sunday, April 28, 2024

కోహ్లిని తప్పించడమే మంచిది: కపిల్ దేవ్

- Advertisement -
- Advertisement -

Give chance to young cricketers in place of Kohli:Kapil

న్యూఢిల్లీ: వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా విరాట్ కోహ్లిని మూడు ఫార్మాట్‌లలోనూ ఆడించడాన్ని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పుపట్టాడు. గత రికార్డులను పెట్టుకుని విరాట్‌కు వరుస అవకాశాలు కల్పించడం మంచిది కాదన్నాడు. కోహ్లి స్థానంలో యువ క్రికెటర్లకు ఛాన్స్ ఇవ్వాలన్నాడు. కోహ్లి కూడా దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఫామ్‌ను అందుకోవాలన్నాడు. రానున్న టి20 ప్రపంచకప్‌లో కోహ్లికి బదులు ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఇక విరాట్‌కు కొంత కాలం విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. ఖాళీ సమయంలో కోహ్లి సాధనపై దృష్టి పెట్టాలన్నాడు. కాగా, మళ్లీ పూర్వవైభవం సాధించే సత్తా విరాట్‌కు ఉందని కపిల్‌దేవ్ జోస్యం చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News