Saturday, April 27, 2024

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

Gold prices soared again

 

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మళ్ళీ బంగారం ధరలు అల్ టైం రికార్డును చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,000కి చేరింది. అంతేకాకుండా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,180కి చేరింది. అటు వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఇటీవల వెండి కిలో ధర రూ.60 వేలు దాటిన విషయం తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా స్థిరంగా రూ.66,800 వద్ద కొనసాగుతుంది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు బంగారం రేటుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News