Monday, April 29, 2024

వైద్య అర్హతలు ఉంటే కరోనాకు చికిత్స చేయవచ్చు

- Advertisement -
- Advertisement -

Govt approval that corona can be treated if medically qualified

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి

న్యూఢిల్లీ: దేశంలో అనూహ్య రీతిలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా గుర్తింపు పొందిన అర్హతలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వైద్య వృత్తిని లేదా టెలికన్సల్టేషన్‌ను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతి ఇచ్చింది. అయితే ఈ బాధ్యతలను ఉద్యోగులు తమ ఖాళీ సమయాలలో, పూర్తి ఉచితంగా అందచేయాల్సి ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ(డిఓపిటి) బుధవారం జారీచేసిన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ప్రస్తుత కరోనా సంక్షోభ కాలంలో టెలికన్సల్టేషన్ సేవలు సమకూర్చడానికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తమకు అభ్యర్థనలు అందుతున్నాయని 57 సంవత్సరాల నాటి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులను ఉటంకిస్తూ డిఓపిటి తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులలోని సామర్ధాలను ఉపయోగించుకుని, కరోనా వైరస్‌తో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి వైద్య శాస్త్రంంలో తగిన విద్యార్హతలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించాలని ప్రభుత్వ నిర్ణయించిందని డిఓపిటి తెలిపింది. ఇందుకు సంబంధిత శాఖాధికారి అనుమతి ఏదీ ఉద్యోగులు పొందవలసిన అవసరం లేదని, అయితే తమ అధికారిక బాధ్యతలకు ఆటంకం కలిగించకుండా ఉద్యోగులు వైద్య సర్వీసులను లేదా టెలికన్సల్టేషన్ సేవలను పూర్తిగా ఉచితంగా అందచేయవలసి ఉంటుందని డిఓపిటి పేర్కొంది.

Govt approval that corona can be treated if medically qualified

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News