Monday, April 29, 2024

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 కొత్త బిల్లులు

- Advertisement -
- Advertisement -

Govt lists 23 new bills for Monsoon session

న్యూఢిల్లీ: ఈ నెల 14నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం 34 బిల్లులు రానున్నాయి. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా, మిగతావి ఇప్పటికే చట్టసభల్లో ప్రవేశపెట్టి స్థాయీసంఘాల అధ్యయనం కోసం పంపించినవి. ఇందులో 11 బిల్లులను ప్రస్తుతం ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిల జీతభత్యాల తగ్గింపు, నిత్యావసర వస్తు చట్ట సవరణ, రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు, పంటలను వేయడానికి ముందే కార్పొరేట్ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలకు హామీ ఇచ్చే బిల్లు పార్లమెంటు ముందుకు రానున్నాయి.

అలాగే మూడు లేబర్ కోడ్ బిల్లులు కూడా చట్టసభల ముందుకు రానున్నాయి. ఇవేకాకుండా జమ్మూ కశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లీషుతో పాటుగా కశ్మీరీ, డోంగ్రీ, హిందీ భాషలను కూడా అధికార భాషలుగా గుర్తించడానికి సంబంధించిన జమ్మూ, కశ్మీర్ అధికార భాషా బిల్లు, నిత్యావసర వస్తు సవరణ బిల్లు,సహకార బ్యాంకుల నియంత్రణకు ఉద్దేశించిన ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ), అలాగే కొవిడ్ నియంత్రణ విధుల్లో నిమగ్నమైన వైద్య సిబ్బందిపై దాడులు చేయడాన్ని, వేధింపులకు గురిచేయడాన్ని నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించడంతో పాటుగా గరిష్టంగా 7సంవత్సరాలు శిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించడానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టే బిల్లు ప్రధానంగా ఉన్నాయి.

Govt lists 23 new bills for Monsoon session

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News