Monday, April 29, 2024

దివ్యాంగులు ఎదగాలన్నదే ప్రుభుత్వ లక్ష్యం : కొప్పుల

- Advertisement -
- Advertisement -

మంత్రిని కలిసిన చైర్మన్ వాసుదేవరెడ్డి

హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వికలాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెలా ఇస్తున్న రూ. 3016 పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచి శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందని మంత్రి చెప్పారు.

రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలలో మంత్రి కొప్పులను కలిశారు. దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ ను ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడం పట్ల పలువురు దివ్యాంగులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఒక్క పెన్షన్ సౌకర్యమే కాకుండా విద్యా, ఉద్యోగ ఉపాధి రంగాల్లోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం లో 5 శాతం రిజర్వేషన్ తో పాటు బధిరులకు ప్రత్యేక డిగ్రీ కాలేజి ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.

శారీరక దివ్యంగుల రోస్టర్ 56 వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివరించగా రోస్టర్ తగ్గింపు తదితర అంశాలపై సానుకూలంగా స్పందించారన్నారు. దివ్యాంగులను కంటికి రెప్పలా కాపాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పదేండ్లలో 10 వేల కోట్లు ఖర్చుపెట్టిన మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించి న గొప్ప నాయకుడని కొనియాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News