Monday, April 29, 2024

ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తి కావాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షకాలం ప్రారంభం కాదని, త్వరతిగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రాల ఇంద్ఛర్జీలకు సూచించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే లోడ్ చేసి రైస్ మిల్లులకు రవాణా చేయాలని ట్రక్ షీట్ ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతానికి కొనుగోలు చేసిన ధాన్యం రైస్ మిల్లులకు పంపడం విషసంలో కేంద్రాల ఇంచార్జిలు, సూపర్ వైజర్‌లు ప్రత్యేక శ్రద్ధ్ద తీపుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. రైస్ మిల్లులలో ధాన్యం దించుకోవడంలో జాప్యం చేయవద్దని ఎక్కువ మంది హమాలీలను ఏర్టా చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ఎక్కడ లారీల కొరత రాకుండా ధాన్యం రవాణాకు లారీల సమస్య ఉన్నచోట తహశీల్దార్ ఎంవిఐ పోలీస్ అధికారులు వాహనాల కొరత లేకుండా చూడాలన్నారు. ధ్యానం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా శాఖల అధికారులు నిరంరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చివరి ధాన్యం గింజ వరకు ఒనుగోలు చేస్తాని రైతులు ధైర్యంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి వివిధ శాఖల అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News