Monday, April 29, 2024

కాల్పులకు దారితీసిన జోకులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ గన్‌ఫౌండ్రి ఎస్‌బిఐలో కాల్పులకు పాల్పడిన గార్డు
కాంట్రాక్టు ఉద్యోగిపై 3రౌండ్లు కాలడంతో తీవ్రగాయాలు, అపోలో ఆసుపత్రికి తరలింపు
ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి

మన తెలంగాణ/గోషామహల్: నగరం నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. అబిడ్స్ గన్‌ఫౌంఢ్రిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డు, అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిపై 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కాంట్రాక్ట్ ఉద్యోగిని తీవ్ర గాయాలు కాగా కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు, బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు, సహచర బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించి, గాయాలకు గురైన వ్యక్తిని చికిత్సల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌బిఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఎండి సర్దార్‌ఖాన్, అదే బ్యాంకులో కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న సురేందర్‌లు స్నేహంగా ఉండేవారు. కాగా, కొంత కాలంగా సురేందర్ సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌తో పరిహాసం చేస్తుండేవాడు. ఈ నే పథ్యంలో తనతో పరిహాసం ఆడవద్దని సర్దార్‌ఖాన్ సురేందర్‌ను పలుమార్లు సున్నితంగా మందలించాడు. అయినప్పటికీ సురేందర్ సెక్యూరిటీ గార్డు సర్దా ర్‌ఖాన్‌తో పరిహాసం ఆడటం మానలేదు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుమారు 3:20 గంటల సమయంలో సురేందర్ విధి నిర్వహణలో ఉన్న సర్దార్‌ఖాన్‌పై జోకులు వేయడంతో ఇరువురి మధ్య నెలకొన్న స్వల్ప వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్ర హించిన సర్దార్‌ఖాన్ తన చేతిలో గల తుపాకితో సురేందర్‌పై కాల్పులు జరిపాడు. సర్దార్‌ఖాన్ 3 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ సురేందర్ ఛా తీ కింది భాగంలోకి చొచ్చుకుపోవడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. హఠాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో అక్కడున్న ఉద్యోగులు, ఖాతాదారులు భయంతో పరుగులు పెట్టారు.

ఈ హఠాత్పరిణామంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఉద్యోగులు కొద్దిసేపటికే తేరుకున్న ఉద్యోగులు చికిత్సల నిమిత్తం తీవ్రగాయలకు గురైన సురేందర్‌ను హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రితి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అబిడ్స ఏసిపి వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌రావులలు కాల్పులు జరిపిన సర్దాన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిరణ చేపట్టారు. ఈ సందర్బంగా ఎసిపి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌బిఐ బ్యాంకులో ఫైరింగ్ జరిగిందని ఫిర్యాదు వచ్చింది. సర్దార్‌ఖాన్ అనే వ్యక్తి గత 9ఏళ్లుగా ఎస్‌బిఐలో సెక్యూరిటీ గార్డుగా విదులు నిర్వహిస్తున్నాడు. అదే బ్యాంకులో కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న సురేందర్ అనే ఉద్యోగి తరచుగా సర్దార్‌ఖాన్‌తో పరాచికాలు (పరిహాసం) ఆడేవాడు. ఈ నేపథ్యం బుధవారం ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం పెరగడంతో కాల్పులకు దారి తీసింది. కోపోద్రిడైన సర్దార్‌ఖాన తన చేతిలో గల తుపాకీతో సురేందర్‌పై 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సురేందర్ పొట్ట భాగంలోకి రెండు బుల్లెట్లు చొచ్కుకుపోయాయి. హుటాహుటిన సహచర ఉద్యోగులు సురేందర్‌ను చికిత్సల నిమిత్తం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేందర్ ఆరోగ్యం నిలలకడగా ఉన్నట్లు తమకు వైద్యుల నుండి సమాచారం అందినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్‌ఖాన్ మా అదుపులో ఉన్నాడని, 3:25 గంటలకు కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. క్లూస్ టీమ్‌కు సమాచారం అందించి వారిని రప్పించడంతో క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలను సేకరిస్తున్నారని, బ్యాంకులో సీసీ పుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నట్లు ఎసిపి వెంకట్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News