Wednesday, May 8, 2024

ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు: కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Haj Yatra 2020 Pilgrimage Cancelled

న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. సౌదీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ప్రటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ… హాజ్ యాత్రకు దరఖాస్తు  చేసుకున్న వారికి నగదు మొత్తం వెనక్కి ఇస్తామని సూచించారు. డైరెక్ట్ ట్రాన్స్ ఫర్ ద్వారా డబ్బు వెనక్కి ఇస్తామని పేర్కొన్నారు. హజ్ యాత్ర కోసం 2,300 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది అనుమతి పొందిన వారు 2021లో వినియోగించుకోవచ్చని కేంద్రమంత్రి ప్రకటించారు.

Haj Yatra 2020 Pilgrimage Cancelled due to corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News