Thursday, May 9, 2024

స్టీరియో టైప్ స్క్రిప్టులు చేయను

- Advertisement -
- Advertisement -

Hansika about Lady oriented movies

 

అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక. కొన్నాళ్లు తెలుగులోనే ఆమె నటించినా పెద్దగా హిట్లేమీ రాలేదు. అదే సమయంలో కాస్త బొద్దుగా మారింది. దాంతో రూటు మార్చి కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ హిట్స్‌ను అందుకుంటూ టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఈమధ్య హన్సిక బరువు తగ్గి స్లిమ్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ “కెరీర్‌లో ముందుకెళ్లాలంటే చేసే పాత్రల్లో మార్పు తప్పనిసరి. అందుకే ఇప్పుడు పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నా”అని హన్సిక చెప్పింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో స్టీరియో టైప్ స్క్రిప్టులు చేయాలని అనుకోవడంలేదని పేర్కొంది ఈ బ్యూటీ. మంచి కథ, పాత్ర ఉంటే తెలుగులో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పింది హన్సిక.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News