Monday, April 29, 2024

బిజెపిలో చేరిన హార్దిక్ పటేల్

- Advertisement -
- Advertisement -

Hardik Patel joins BJP

 

గాంధీనగర్ : కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ , భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సీఆర్ పాటిల్ , హార్ధిక్‌కు కండువా కప్పి బిజెపి లోకి ఆహ్వానించారు. చేరికకు ముందు ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఒక సాధారణ సైనికుడిలా పని చేస్తానని ట్వీట్ చేశారు.

ఇక బిజెపిలో చేరిన అనంతరం హార్దిక్ స్పందిస్తూ నేనెప్పుడూ ఏ పదవి కోసం ఎవరినీ అడగలేదు. ఒక కార్యకర్తలా పని చేసేందుకే బిజెపిలో చేరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పని చేయనీయదని నేను భావించాను. వేరే పార్టీలు కూడా అలాగే ఉన్నాయని అనుకుంటున్నా. అందుకే ఇతర పార్టీల నాయకులంతా బీజేపీలో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. అలాగే నరేంద్రమోడీపై హార్దిక్ ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రపంచ నాయకుడంటూ కీర్తించారు. తాను బీజేపీలో చేరింది జాతీయ వాదం, రాష్ట్రవాదం, ప్రజావాదం, సామాజికవాదాలతోనని హార్దిక్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News