Thursday, May 9, 2024

సిరివెన్నెలది ప్రత్యేక స్థానం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao pays tribute to Sirivennela

హైదరాబాద్: సినీ సాహిత్య యోధుడు సిరివెన్నల సీతారామ శాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. పండితులను, పామరులను మెప్పించిన వ్యక్తి సిరివెన్నెల.తన సినిమా పాటల్లో అశ్లీలత్వానికి చోటు ఇవ్వని వ్యక్తిత్వం ఆయనది. ఆయన గూర్చి తెలియని వారు లేరు. తెలుగు సినిమా రంగంలో ఆయనది ప్రత్యేక స్థానం. సమాజారంలో గొప్ప చైతన్యం రగిల్చించడానికి, అస్పృశ్యతను తొలగించడానికి సినిమా పాటలను గొప్పగా ఉపయోగించారు. సినిమా రంగం అంటే వ్యాపారం ఉంటుంది. అయినా జన చైతన్యానికి తన పాటను వినియోగించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా” అని అన్నారు.

Harish Rao pays tribute to Sirivennela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News