Monday, April 29, 2024

హవాలా మనీ పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎన్నికల సందర్భంగా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అబిడ్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో బైక్‌పై తరలిస్తున్న రూ.45,90,000 లక్షలు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా హవాలా రాకెట్ బయటపడింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉంటూ జాగృతి స్టీల్ షాపులో పనిచేస్తున్నాడు. ముషీరాబాద్‌కు చెందిన సయిద్ షా రహీముద్దిన్ ఖాద్రీ, ఎండి జకీఱ్ హుస్సేన్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నారు. నిందితులు మెట్రోపాలిటన్ సిటీల్లో ప్రధాన బ్రోకర్లు చెప్పినట్లు హవాలా ద్వారా నగదును తరలిస్తుంటారు.

వీరు మెసేజ్‌లు, వాట్సాప్ ద్వారా కోడ్‌లను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మనోజ్‌కుమార్ శర్మ తనకు వచ్చిన మెసేజ్ ద్వారా ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుని బైక్ వెళ్తుండగా తాజ్‌మహల్ హోటల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తాను ప్రధాన ఏజెంట్లు సయిద్ షా రహీముద్దిన్ ఖాద్రీ, ఎండి జకీర్ హుస్సేన్ కోసం ఉన్నానని చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన వాహనాల తనిఖీలో పోలీసులు రూ.1.56లక్షల నగదు సుట్టకున్నారు. జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.6.45లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News