Monday, April 29, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వ్యాపారి సమీర్‌కు 6 వారాల బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆరు వారాల తాత్కాలిక బెయిల్ వెలువరించింది. వైద్య ఆరోగ్య చికిత్స కారణాలతో ఆయనకు ఈ ఊరట కల్పించారు. ఈ వ్యాపారిపై సంబంధిత స్కామ్‌లో మనీలాండరింగ్ కేసు నమోదు అయింది. నిందితుడికి ప్రాణాంతక వ్యాధులు ఉన్నందున ఆయనకు వెంటనే వైద్య సపర్యలు అవసరం ఉందని నిర్థారించుకుని ఈ బెయిల్ ఇస్తున్నట్లు జస్టిస్ చంద్రధారి సింగ్‌తో కూడిన వెకేషన్ బెంచ్ రూలింగ్ ఇచ్చింది.

ప్రతి పౌరుడి ప్రాణాలు ముఖ్యం, ఎవరైనా తమకు సరైన చికిత్స పొందేలా చేసుకునే హక్కు పొంది ఉన్నారని కోర్టు తెలిపింది. నిందితుడు రూ 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ఆరు వారాల బెయిల్‌కు అర్హులని ఆయన ఈ గడువు ముగియగానే జులై 25న సాయంత్రం 5 గంటల లోగా సరెండర్ కావల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల పరిధిలోనే కేసుల్లో నిందితులైన వారిలో అనారోగ్యం, అవసరార్థులకు ఉపశమనం కల్పించవచ్చునని , దీనిని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు బెంచ్ తెలిపింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News