Monday, April 29, 2024

సరికొత్త శిఖరాలకు..

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా దూకుడు కొనసాగిస్తున్నాయి. వారం చివరి రోజు ట్రేడింగ్‌లో ఐటి షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. దీంతో సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 66 వేల మార్క్‌ను దాటింది. ఆఖరికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 502 పాయింట్లు లేదా 0.77 శాతం లాభంతో 66,060.90 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 151 పాయింట్లు లాభంతో 19,564 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది గురువారం 19,413.75 పాయింట్ల వద్ద ఉంది.

30 సెన్సెక్స్ కంపెనీలలో 10 మాత్రమే నష్టాలను చవిచూడగా, 20 కంపెనీల షేర్లు బలంగా ముగిశాయి. ఐటీ షేర్లు మార్కెట్‌లో ర్యాలీని కొనసాగించాయి. సెన్సెక్స్‌లో టిసిఎస్ షేరు దాదాపు 5.15 శాతం లాభపడింది. అలాగే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో వంటి పెద్ద ఐటి షేర్లు కూడా 4.50 శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్‌లో టాప్ 5 గెయినర్లు ఐటి రంగానికి చెందినవే. ఐటి కంపెనీల త్రైమాసిక ఫలితాలు బాగుండడం వల్ల మార్కెట్లో లాభపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News