Monday, April 29, 2024

జకోవిచ్‌కు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

లండన్: ఇటీవల ముగిసిన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌కు మరో షాక్ తగిలింది. స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ సమరంలో జకోవిచ్ అనూహ్య ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన జకోవిచ్ రాకెట్ విరగొట్టి నిబంధనలు ఉల్లంఘించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు జకోవిచ్‌కు భారీ జరిమానా విధించారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

మ్యాచ్ చేజారుతుందని భావించిన జకో సహనం కోల్పోయి అంపైర్‌పై దురుసుగా ప్రవర్తించాడు. అంతేగాక రాకెట్‌ను సయితం విసిరికొట్టాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ జకోవిచ్‌కు 8000 డాలర్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని జకోవిచ్‌కు లభించిన వింబుల్డన్ ప్రైజ్‌మనీ నుంచి నిర్వాహకులు వసూలు చేశారు. ఈ విషయాన్ని వింబుల్డన్ నిర్వహణ కమిటీ ఆల్ ఇంగ్లండ్ టాన టెన్నిస్ క్లబ్ అధికారికంగా ధ్రువీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News