Monday, April 29, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం..

- Advertisement -
- Advertisement -

Three days rain forecast for Telangana

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు సాయంత్రం నగరంలో మబ్బులు కమ్ముకొని ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, బేగంపేట్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, బాల్ నగర్, సుచిత్ర, బోరబండ, బంజారహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, కోఠీ, హాబిడ్స్, చాదర్ ఘట్, దిల్ సుక్ నగర్ రామాంతపూర్ వంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీగా వానలు పడడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి.

Heavy Rainfall in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News