Friday, May 17, 2024

గూఢచారిగా నిఖిల్

- Advertisement -
- Advertisement -

Hero Nikhil new movie started

 

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రం గ్యారీ బి.హెచ్ (గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్) దర్శకత్వంలో రాబోతోంది. రెడ్ సినిమాస్ పతాకంపై కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహుర్తం షాట్‌కు గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత కూతురు మ్రియు, కొడుకులు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచాన్ చేశారు. నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిఖిల్ మొదటిసారిగా ఈ చిత్రంలో గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.అనిరుధ్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, రవి ఆంటోని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News