Monday, April 29, 2024

టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వానికి, టిఎస్‌పిఎస్‌సికి నోటీసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీల తరువాత ప్రస్తుతం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గ్రూప్ 3, గ్రూప్4 ఎగ్జామ్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు ఆ ఎగ్జామ్స్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జీవో 55, 136 కొట్టివేయాలని 101 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్3, గ్రూప్4లో ఉన్న టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించి, తరువాత తొలగించారని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, టిఎస్‌పిఎస్‌సికి నోటీసులు జారీ చేసింది. జూలై 13కి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది

గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల దరఖాస్తులు

గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1363 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా, తర్వాత మరో 12 పోస్టులను జతచేశారు. బిసి గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటనలో పేర్కొనగా తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది. రాష్ట్రంలో గ్రూప్-3 దరఖాస్తు గడువు ఫిబ్రవరి 23తో ముగిసింది. రాష్ట్రంలో 1,375 గ్రూప్-3 పోస్టులకు గాను దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ నెలకొంది. గ్రూప్-3 పోస్టులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. చివరి మూడు రోజుల్లో 90,147 మంది దరఖాస్తు చేసుకోగా, ఇక చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు రావడం విశేషం. అయితే అభ్యర్థుల ఫీజు చెల్లింపుల వివరాలు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది.

జూలై 1న గ్రూప్4 ఎగ్జామ్

టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. గ్రూప్-4 రాత పరీక్షను జులై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-4 కింద 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. గ్రూప్4 ఉద్యోగాలకు దాదాపు 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంటే 1129 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తొలిగించింది. పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకుగాను కొన్నింటికి మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మిగిలిన ఖాళీల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల పోస్టుల సంఖ్య తగ్గించాల్సి వచ్చింది. మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సిబిటి) లేదా ఒఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) -150 ప్రశ్నలు-150.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News