Sunday, April 28, 2024

కాంగ్రెస్ హిమాచల్ ఎన్నికల వాగ్దానాలు

- Advertisement -
- Advertisement -

ఉచిత కరెంటు.. ఐదులక్షల ఉద్యోగాలు.. మహిళకు ఆర్థిక సాయం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, యువతకు ఐదులక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధానంగా హామీలు వెలువరించింది. ఎన్నికల ప్రణాళికను పార్టీ వర్గాలు శనివారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సమక్షంలో విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీనే ఒకే దశలో ఈ పర్వత రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగుతుంది. 68 మంది సభ్యుల అసెంబ్లీలో అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్‌లు ప్రచార జోరు పెంచాయి. ఇప్పుడు బిజెపి నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భారీ స్థాయిలో ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంది. ఓల్డ్ పెన్షన్ స్కీం పునరుద్ధరణ, రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ 1500 ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను చేపడుతామని కాంగ్రెస్ తెలిపింది.

హిమాచల్‌కు ఎఐసిసి తరఫున ఇన్‌చార్జిగా నియమితులు అయిన రాజీవ్ శుక్లా, పిసిపి అధ్యక్షులు సుఖ్వీందర్ సింగ్ సుఖూ, పార్టీ కార్యదర్శులు తేజీందర్ పాల్ బిట్టూ, మనీష్ చత్రత్ ఇతరులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ఔత్సాహిక యువకులకు రూ 10 కోట్ల స్టార్టప్ ఫండ్ కల్పిస్తామని, ప్రతినియోజకవర్గంలో నాలుగు ఇంగ్లీషు మాధ్యమిక స్కూళ్లు తెరుస్తారని పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలో ఉ్న బిజెపి ప్రజల ఆకాంక్షలను తీర్చలేకపోయిందని . ఐదేళ్లుగా ప్రజలకు చేసిందేమీ లేదని పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ధనిరామ్ షండిల్ విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపి, కాంగ్రెస్‌లు ఒక టర్మ్ తరువాత అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు హిమాచల్ ఓటర్లు ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీని ఎంచుకుని తీర్పు వెలువరిస్తూ ప్రతిసారి అధికార మార్పిడి కోరుకుంటున్నారు. ఈ సారి కూడా ఇదే జరిగేలా చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఈ చరిత్రను తిరగరాయాలని బిజెపి సిద్ధం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News