Monday, April 29, 2024

హాలీవుడ్ నటుడు మైఖేల్ డగ్లస్‌కు సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్‌కు ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. గోవాలో త్వరలో జగరనున్న 54వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం(ఇఫీ)లో ఈ వార్డును ఆయనకు ప్రదానం చేస్తారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది గోవాలో జరగనున్న ఇఫీలో మైఖేల్ డగ్లస్‌తోపాటు ఆయన భార్య, ప్రముఖ నటి, దాత క్యాథరిన్ జేటా జోన్స్, వారి కుమారుడు, నటుడు డైలాన్ డగ్లస్ కూడా పల్గొంటారు.

1999లో స్థాపించిన సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రతి సంవత్సరం సినిమా రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. రెండు అకాడమీ అవార్డులు, ఐదు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఒక ఎమ్మీ అవార్డును పొందిన మైఖేల్ డగ్లస్ తన నటనా జీవితంలో అనేక మరపురాని పాత్రలు పోషించారు. ఆయన నటించిన వాల్ స్ట్రీట్(1987), బేసిక్ ఇన్‌స్టింక్ట్(1992), ఫాలింగ్ డౌన్(1993), ది అమెరికన్ ప్రెసిడెంట్(1995), ట్రాఫిక్(200), బిహైండ్ ది డ్యాండెలెబ్రా(2013) చిత్రాలు కళాఖండాలుగా నిలిచిపోయాయి. ఆయన నిర్మించిన అనేక చిత్రాలు విమర్శకుల ప్రశంసలు సైతం పొందాయి. ఒన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్(1975), ది చైనా సిండ్రోమ్(1979), ది గేమ్(1999) చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News