Friday, May 17, 2024

పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

House arrest movie pre release event

ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాష్, రవిబాబు, తాగుబోతు రమేష్, సునైన, కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ, రామ్‌ప్రసాద్, చంద్రమహేష్, అశోక్ రెడ్డి, ఎన్.శంకర్, చందు రెడ్డి తదితరులు పాల్గొని బిగ్ టిక్కెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్రా మాట్లాడుతూ “ఈ తరం పిల్లలు ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారెలా స్పందిస్తున్నారనే విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి పిల్లల సినిమా ఇది”అని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకులను అరెస్ట్ చేస్తుందని అనుకుంటున్నాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, అనూప్ రూబెన్స్, కౌశిక్, తాగుబోతు రమేష్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News