Monday, April 29, 2024

సిద్దిపేట చేపలకు జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరణ జరిగి, కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో యేడాది పొడ‌వునా చెరువులు, కాల్వ‌ల్లో పుష్క‌లంగా నీళ్లు ఉంటున్నాయి. పైగా ఉచిత చేప పిల్ల‌ల పంపిణీ పేరిట సిద్దిపేట జిల్లాలోని చెరువులు, జ‌లాశ‌యాల్లోకి కోట్లాది చేప పిల్ల‌ల‌ను విడుద‌ల చేశారు. ఫ‌లితంగా సిద్దిపేట జిల్లాలో చేప‌ల ఉత్ప‌త్తి పెరిగింది. ఇప్పుడు ఆంధ్రాకే చేప‌లను ఎగుమ‌తి చేసే స్థాయికి చేరింది. సిద్దిపేటలోని రంగనాయక సాగర్, నియోజకవర్గంలోని పలు చెరువుల్లో ప‌ట్టిన చేప‌ల‌ను పశ్చిమ బెంగాల్-కలకత్తా, మహారాష్ట్రలోని చంద్రాపూర్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ‌కు ఎగుమ‌తి చేస్తున్నామని ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

జాతీయ మార్కెట్ లో సిద్దిపేట చేపలు వెళ్లడంతో మత్స్యకారులకు ఆశాజనకంగా మారింది. తమ ప్రాంతంలో పెరిగిన చేపలు కలకత్తా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, మహారాష్ట్ర చందాపూర్ పక్క రాష్ట్రాలకు ఎగుమతి అవడం సంబురంలో మునిగి తేలుతున్నారు. కిలో నుంచి దాదాపు 12 కిలోలు ఉన్న చేపలు ఉన్నాయని డిమాండ్ మరింత బాగుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News