Monday, April 29, 2024

మియాపూర్ లో భారీగా బంగారం, వెండి, నగదు పట్టివేత..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పెద్ద మొత్తం నగదు పట్టుబడుతుంది. సోమవారం హైదరాబాద్ నంగరంలో మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద మాదాపూర్ ఎస్ఓటి పోలిసులు తనిఖీలు చేపట్టి.. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఎలాంటి పత్రాలు లేకుండా 27 కేజీల బంగారు ఆభరణాలు, 15కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలెరో కారులో బషీర్ బాగ్ లోని ఓ నగల దుకాణం నుండి బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు నిందితులు చెబుతున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 14 కోట్ల 70 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును ఎస్ఓటి పోలిసుల సీజ్ చేసి మియాపూర్ పోలీసులకు అప్పగించారు. స్కూటీలో తరలిస్తున్న 14 లక్షల 93 వేల నగదు మియాపూర్ పోలీసుల వహన తనిఖీల్లో పట్టుడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News